
దసరా శలవులు అయిపోయాయి. ప్రయాణాలు పదనిసలు - అలసటలు షాపింగులు అన్నీ అయి మళ్ళీ రొటీన్ మొదలు. అంతా బాగానే ఉంది- బ్యాంకు లో బాలన్సు తప్ప. imax లో రోబో సినిమా - పది మంది కలిసి చూసే వ్యవహారమా? టికెట్స్ online కొనేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? మూవీ మొదటి నుంచి చివరి దాకా స్నాక్స్, కోల్డ్ డ్రింక్స్ ఎవరు కొంటారు? పెద్దవాళ్ళు తప్పిన్చుకున్దామనుకున్నా పిల్లలు ఊరుకుంటారా? అంతా కలిపీ 5000/- కి సరిపెడితే పిల్లలు - పెద్దలు ఒకే శ్రుతి లో మూవీ అవగానే "batterylow" అంటూ రాగాలాపన. మళ్ళీ పూర్తి స్థాయి లో కడుపులు నిండాలంటే మరో 5000/- వా...
