అమ్మయ్య.. అయిపొయింది స్టడీ. తొమ్మిది రోజులు ఆగష్టు ఎండల్లో తిరిగి తిరిగి అలసిపోయాను. ఇంక రేపటినుంచి కూల్ ఆఫీసు. ఈ ఎసి ఆఫీసు లకి అలవాటు పడిపోయి, ఫీల్డ్ వర్క్ అంటే ప్రాణం మీదకి వస్తోంది. కానీ రోజూ రకరకాల వ్యక్తుల్ని కలవడం వాళ్ళ జీవితాల్ని observe చెయ్యడం అదో వెరైటీ experience. అదృష్టం బాగుండి కడుపులో చల్ల కదలని ఉద్యోగం దొరికింది కనక హాయిగా బ్రతికిపోతున్నాను. లేకపోతే ఇలా తిరిగే ఉద్యోగం అయితే ఎంత కష్టం!!!
భాష రాదు. ఎండలు చమటలు...వెళ్ళిన చోట మాకు కావలసిన సమాచారం దొరకదు. ఎన్ని సార్లు చెప్పినా మాకు అనవసరమైన విషయాలే తప్ప చెప్పేది అర్ధం చేసుకోరు. IQ లెవెల్స్ లో తేడాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. ఒక గ్రామీణ బ్యాంకు ఆఫీసర్ కి తను ఫైనాన్సు చేసిన "పెద్ద" ఖాతాలు చూపించాలని సరదా. మాకు కావలసినది చిన్న చిన్న ఖాతాలు ఎలా పనిచేస్తున్నాయో చూడడం. ఏమి చేస్తాం, ఆయన చూపించిన ఖాతాలు తప్ప మాకు వేరే choice లేదు.
గ్రామీణుల అమాయకత్వం, వారి అతిథి మర్యాదలు, రోజూ త్రాగలేనన్ని thandaa పానీయాలు, బాత్రూం సౌకర్యమ్ కరవై పడే అవస్థలు, అమ్మో... ఒకటా రెండా చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథం అవుతుంది.
మీ వ్యాపారం లో ఎంత మిగులుతోందని అడిగితే అదేదో చెప్పకూడని విషయం లాగా కప్పదాటు సమాధానాలతో వారు చేసే ఫీట్ లు ప్రత్యక్షంగా చూడాలే తప్ప చదివి తెలుసుకోలేరు. అభినందనీయమైన విషయం ఏమిటంటే, వాళ్ళు బ్రతుకుతూ మరో పదిమందికి బ్రతుకు తెరువు కల్పిస్తున్నారు - ఈ చిన్న చిన్న వ్యాపారస్తులందరూ. అద్భుతమైన హస్తకళలు, అతి నవీనమైన సాంకేతిక వినియోగం, అస్తవ్యస్తమైన సదుపాయాలూ, అరకొర సహకారం - అయినా పట్టు వదలకుండా వారు చేసే కృషి చూస్తే అభినందించడం చాలా తక్కువ స్థాయికి చెందుతుంది. వారిని ఆరాధించాలి. అనుసరించాలి. ప్రాతః స్మరణం చేసుకోవాలి.
Thursday, August 26, 2010
Wednesday, August 11, 2010
ఎప్పుడో వ్రాసానిది ....ప్రేమ అనే యండమూరి నవల పై నా అభిప్రాయం

ప్రతి పదమూ సరిగమపదముగా..ప్రతి వాక్యామూ ఒక సరళీ స్వరముగా - ప్రతి ఉపమానమూ అపురూపముగా... మా అభిమాన రచయిత స్వరకల్పన చేసిన మృదు మధుర మంజుల నవలానాదం "ప్రేమ"
anthropology ని ప్రేమతో అనుసంధానం చేసి - అపాచీల్నీ, అజరామర శ్రుంగారానుభూతినీ బీజిమ్స్ గా మార్చి - రచయితే ఎక్కడో స్వయంగా ఒప్పుకున్నట్టు - ప్రతి అక్షరం అందంగా చెక్కడం కోసం ఆరునెలలు పడిన కష్టం - ఈ నూటా ఎనభై ఎనిమిది పేజీల 'ప్రణయ ప్రబంధం' లో అణువణువునా ప్రత్యక్షమవుతుంది. కనులు చెమర్చే అద్భుతమైన రసరమ్యానుభూతిని మిగల్చడంలో క్రుతక్రుత్యమవుతుంది.
నవలకి తొడిగిన అందమైన కవరుపేజీ లాంటి ఈ ఫీలింగ్ దాటి లోపలికి తొంగి చూస్తే - రెండు విభిన్నమైన complicated topics కి వేసిన అతి సున్నితమైన ముడిలాంటి కధాంశం కనిపిస్తుంది. Complicated మాత్రమె కాదు - universal కూడా అయిన ఈ రెండు topics నీ రచయిత deal చేసిన పద్ధతి చాలా వినూత్నమైనది - కాస్త విపత్కరమైనదీ కూడా!
ఆ topics ప్రేమ - ఫెమినిజాలైతే - ముడి మాత్రం అందరికీ అంత సులభంగా అర్ధం కానిది! (దాన్ని వివరించడం అనే పాయింట్ కి వఛ్చేసరికి రచయిత ఉద్విగ్నత అచ్చులొకి రూపాంతరం చెందడం కాస్త ఆశ్చర్యదాయకం!) సకల మానసిక రుగ్మతలకీ మూలకారణం ప్రేమరాహిత్యమేనని తీర్మానించి, ప్రేమించి 'భారతులూ', ప్రేమించబడక 'వరాలమ్మలు' అవుతారని జాలిపడి - నిజమైన ప్రేమకి నిర్వచనం నిస్వార్ధమైన సౌందర్యలాలసగా సిధ్ధాంతీకరించిన రచయిత - మొదటి టాపిక్ ని సమర్ధవంతంగా present చేయగలిగినా - రెండవ టాపిక్ దగ్గరకొచ్చేసరికి పాఠకులకి కాస్తంత confusion create చేస్తాడు.
బ్రహ్మ - సరస్వతి - నారదుల సంభాషణ - రాధికా స్వాంతనం - చలం (ఇదే కాలమ్ లో ఈ రచయిత వర్తమానపు 'చలం' గా అభివర్ణింపబడడం గమనార్హం.) - ఇవన్నీ చదివేసరికి స్త్రీ స్వేఛ్చ కి పర్యవసానం - పరిణామం - ఆర్ధిక - మానసిక స్వేఛ్చఃలని నిర్ద్వందంగా చెప్పి - లైంగిక స్వేఛ్చ విషయానికి వఛ్చేసరికి మాత్రం కాస్త escapism
వెతుక్కున్నట్టుగా అనిపిస్తుంది.
ఇవి చూడండి మీకేమనిపిస్తుందో -
౧. ప్రేమంటే ఆహ్లాదం - అది స్త్రీ పురుష సంపర్కమే కానవసరం లేదు
౨. నాలుక దాహం వేరు - అది నీటితో తీరేది - శరీరదాహం కూడా వేరే - దాన్ని కూడా ఎలాగో ఒకలాగు తీర్చుకోవచ్చు. కానీ మనసు దాహం - ఎన్ని వేల ప్రేమసముద్రాల్లో మునిగితే అదితీరుతుంది?
౩. విలువ తెలిసినవాడి చేతిలో పడి విలువ పెంచుకునేవి - విరీ - వనితా
౪. నేను వివాహితను చలం - అంది రుధ్ధకంఠంతో
౫ రాధాకృష్ణుల ప్రణయాన్ని శ్రుంగారస్ఠాయికి 'దింపింది' (slip of pen?) ముద్దుపళని
౬. ఆధునిక కవులు శారీరక సంబంధం లేని ఉదాత్త ప్రేమగురించి వ్రాయడం
౭. చెట్టునీ, పుట్టనీ ప్రేమించగలగాలి...అదీ ప్రేమంటే! శారీరక సంపర్కం చిన్న విషయం
౮. తమ జీవితాల్ని ఒక పురుషుడి చుట్టూ నిర్మించుకోని స్త్రీలూ...తమ జీవితాల్లో విజయం సాధించారు. ఆ పరిణామ క్రమంలో తమ ఆనందం కోసం కొన్ని లక్ష్మణరేఖల్ని దాటినా సరే...
౯. ఈ జన్మకి నాకీ అనుభవం చాలు ప్రభూ! ఈ తృప్తితో ఒక జీవితకాలం బ్రతికేస్తాను
౧౦. ఒక స్థాయి దాటిన శృంగారం లో భౌతికమే మానసికం - మానసికమే భౌతికం
ఇవి నా confusion కి ఉదాహరణలు మాత్రమె. వివరంగా వ్రాయబోతే ఒక పరిశోధనాత్మక వ్యాసం తయారవుతుంది.
ఇకపోతే ఇప్పుడిప్పుడే మరుగైపోతున్న జ్ఞాపకాల్లాంటి ఉషస్సుల్నీ, ఉగాదులనీ, సంక్రాంతుల్నీ, ఏరువాకమ్మల్నీ - అన్నిటికన్నా ముఖ్యంగా లంగా వోణీలాటి అందమైన సాంప్రదాయికాలనీ తట్టిలేపి గుర్తు చేసినందుకూ, పరిచయం లేని ప్రబంధాల్నీ జానపదాల్నీ, ప్రయోజనాత్మకంగా ప్రయోగించినండుకూ మాత్రం రచయితకు కృతజ్ఞతలు.
అన్నిటికన్నా ముఖ్యంగా 'అదిత్యపురం' అనే అందమైన రేఖాచిత్రాన్ని పూజాపీఠాన్ని చెక్కిన శిల్పిలా గొప్ప ఏకాగ్రతతో పాఠకుల మనోఫలకంపైకి తీసుకురాగాలగిన ఆ 'భావుకునికి' వేనవేల వందనాలు.
చివరగా Lion of apachies ని ఆంధ్ర ప్రదేశ్ కి తీసుకురాగాలగిన Lion of Telugus ఊహాశక్తికి శతకోటి ప్రణామాలు!!!
Wednesday, August 4, 2010
Subroto Bagchi & Robin Sarma....
"Go, Kiss the World" by Bagchi and "Leader who had no title" by Robin...latest in my list, after the "outliers" by Malcolm Gladwell. And of course..more 'n more blogs...especially Telugu blogs...So much talent...I wonder all these blogs would have been ended up as "personal diaries" or just wavering thoughts never to be expressed. Thanx to net..thanx to all these bloggers!!!
Bagchi impressed me a lot...More than him, his mother - quite a strong character!!! These are the kind of people mostly remain unheard of..unsung for...I'm sure..there could be 1000s of such ladies especially in India. Battling with adversaries, they manage to lead sans titles. I know atleast 5-6 ladies who're unfortunate to lose their husbands at the prime of their age and struggle through bringing up the kids...in many a case more than 5-6 kids. With no regular income sources and no reliable family members to bank on...oh...I salute them.
Bagchi impressed me a lot...More than him, his mother - quite a strong character!!! These are the kind of people mostly remain unheard of..unsung for...I'm sure..there could be 1000s of such ladies especially in India. Battling with adversaries, they manage to lead sans titles. I know atleast 5-6 ladies who're unfortunate to lose their husbands at the prime of their age and struggle through bringing up the kids...in many a case more than 5-6 kids. With no regular income sources and no reliable family members to bank on...oh...I salute them.
Subscribe to:
Posts (Atom)
