Wednesday, August 11, 2010

ఎప్పుడో వ్రాసానిది ....ప్రేమ అనే యండమూరి నవల పై నా అభిప్రాయం




ప్రతి పదమూ సరిగమపదముగా..ప్రతి వాక్యామూ ఒక సరళీ స్వరముగా - ప్రతి ఉపమానమూ అపురూపముగా... మా అభిమాన రచయిత స్వరకల్పన చేసిన మృదు మధుర మంజుల నవలానాదం "ప్రేమ"
anthropology ని ప్రేమతో అనుసంధానం చేసి - అపాచీల్నీ, అజరామర శ్రుంగారానుభూతినీ బీజిమ్స్ గా మార్చి - రచయితే ఎక్కడో స్వయంగా ఒప్పుకున్నట్టు - ప్రతి అక్షరం అందంగా చెక్కడం కోసం ఆరునెలలు పడిన కష్టం - ఈ నూటా ఎనభై ఎనిమిది పేజీల 'ప్రణయ ప్రబంధం' లో అణువణువునా ప్రత్యక్షమవుతుంది. కనులు చెమర్చే అద్భుతమైన రసరమ్యానుభూతిని మిగల్చడంలో క్రుతక్రుత్యమవుతుంది.
నవలకి తొడిగిన అందమైన కవరుపేజీ లాంటి ఈ ఫీలింగ్ దాటి లోపలికి తొంగి చూస్తే - రెండు విభిన్నమైన complicated topics కి వేసిన అతి సున్నితమైన ముడిలాంటి కధాంశం కనిపిస్తుంది. Complicated మాత్రమె కాదు - universal కూడా అయిన ఈ రెండు topics నీ రచయిత deal చేసిన పద్ధతి చాలా వినూత్నమైనది - కాస్త విపత్కరమైనదీ కూడా!
ఆ topics ప్రేమ - ఫెమినిజాలైతే - ముడి మాత్రం అందరికీ అంత సులభంగా అర్ధం కానిది! (దాన్ని వివరించడం అనే పాయింట్ కి వఛ్చేసరికి రచయిత ఉద్విగ్నత అచ్చులొకి రూపాంతరం చెందడం కాస్త ఆశ్చర్యదాయకం!) సకల మానసిక రుగ్మతలకీ మూలకారణం ప్రేమరాహిత్యమేనని తీర్మానించి, ప్రేమించి 'భారతులూ', ప్రేమించబడక 'వరాలమ్మలు' అవుతారని జాలిపడి - నిజమైన ప్రేమకి నిర్వచనం నిస్వార్ధమైన సౌందర్యలాలసగా సిధ్ధాంతీకరించిన రచయిత - మొదటి టాపిక్ ని సమర్ధవంతంగా present చేయగలిగినా - రెండవ టాపిక్ దగ్గరకొచ్చేసరికి పాఠకులకి కాస్తంత confusion create చేస్తాడు.
బ్రహ్మ - సరస్వతి - నారదుల సంభాషణ - రాధికా స్వాంతనం - చలం (ఇదే కాలమ్ లో ఈ రచయిత వర్తమానపు 'చలం' గా అభివర్ణింపబడడం గమనార్హం.) - ఇవన్నీ చదివేసరికి స్త్రీ స్వేఛ్చ కి పర్యవసానం - పరిణామం - ఆర్ధిక - మానసిక స్వేఛ్చఃలని నిర్ద్వందంగా చెప్పి - లైంగిక స్వేఛ్చ విషయానికి వఛ్చేసరికి మాత్రం కాస్త escapism
వెతుక్కున్నట్టుగా అనిపిస్తుంది.
ఇవి చూడండి మీకేమనిపిస్తుందో -
౧. ప్రేమంటే ఆహ్లాదం - అది స్త్రీ పురుష సంపర్కమే కానవసరం లేదు
౨. నాలుక దాహం వేరు - అది నీటితో తీరేది - శరీరదాహం కూడా వేరే - దాన్ని కూడా ఎలాగో ఒకలాగు తీర్చుకోవచ్చు. కానీ మనసు దాహం - ఎన్ని వేల ప్రేమసముద్రాల్లో మునిగితే అదితీరుతుంది?
౩. విలువ తెలిసినవాడి చేతిలో పడి విలువ పెంచుకునేవి - విరీ - వనితా
౪. నేను వివాహితను చలం - అంది రుధ్ధకంఠంతో
౫ రాధాకృష్ణుల ప్రణయాన్ని శ్రుంగారస్ఠాయికి 'దింపింది' (slip of pen?) ముద్దుపళని
౬. ఆధునిక కవులు శారీరక సంబంధం లేని ఉదాత్త ప్రేమగురించి వ్రాయడం
౭. చెట్టునీ, పుట్టనీ ప్రేమించగలగాలి...అదీ ప్రేమంటే! శారీరక సంపర్కం చిన్న విషయం
౮. తమ జీవితాల్ని ఒక పురుషుడి చుట్టూ నిర్మించుకోని స్త్రీలూ...తమ జీవితాల్లో విజయం సాధించారు. ఆ పరిణామ క్రమంలో తమ ఆనందం కోసం కొన్ని లక్ష్మణరేఖల్ని దాటినా సరే...
౯. ఈ జన్మకి నాకీ అనుభవం చాలు ప్రభూ! ఈ తృప్తితో ఒక జీవితకాలం బ్రతికేస్తాను
౧౦. ఒక స్థాయి దాటిన శృంగారం లో భౌతికమే మానసికం - మానసికమే భౌతికం

ఇవి నా confusion కి ఉదాహరణలు మాత్రమె. వివరంగా వ్రాయబోతే ఒక పరిశోధనాత్మక వ్యాసం తయారవుతుంది.

ఇకపోతే ఇప్పుడిప్పుడే మరుగైపోతున్న జ్ఞాపకాల్లాంటి ఉషస్సుల్నీ, ఉగాదులనీ, సంక్రాంతుల్నీ, ఏరువాకమ్మల్నీ - అన్నిటికన్నా ముఖ్యంగా లంగా వోణీలాటి అందమైన సాంప్రదాయికాలనీ తట్టిలేపి గుర్తు చేసినందుకూ, పరిచయం లేని ప్రబంధాల్నీ జానపదాల్నీ, ప్రయోజనాత్మకంగా ప్రయోగించినండుకూ మాత్రం రచయితకు కృతజ్ఞతలు.

అన్నిటికన్నా ముఖ్యంగా 'అదిత్యపురం' అనే అందమైన రేఖాచిత్రాన్ని పూజాపీఠాన్ని చెక్కిన శిల్పిలా గొప్ప ఏకాగ్రతతో పాఠకుల మనోఫలకంపైకి తీసుకురాగాలగిన ఆ 'భావుకునికి' వేనవేల వందనాలు.

చివరగా Lion of apachies ని ఆంధ్ర ప్రదేశ్ కి తీసుకురాగాలగిన Lion of Telugus ఊహాశక్తికి శతకోటి ప్రణామాలు!!!

0 comments:

Post a Comment